పవన్ కల్యాణ్‌పై YCP ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
పవన్ కల్యాణ్‌పై YCP ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సైకిల్‌పై తిరిగిన వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు.. అక్రమ లే ఔట్ల ద్వారా వేల కోట్లు సంపాదించాడంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల్లో పిచ్చిగా డ్యాన్సులు వేస్తూ నన్ను తిడుతున్నారని.. చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో చిరంజీవి ఆహ్వానంతోనే ప్రజా రాజ్యం పార్టీలో చేరానని.. తనకు చిరంజీవి రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. చిరంజీవి తమ్ముడు కాకపోయి ఉంటే.. పవన్ కల్యాణ్ టీ షాప్‌లో పని చేసుకునే వారని విమర్శించారు.

Advertisement

Next Story