Ap News: ముదిరిన ‘చెప్పు’ రాజకీయం.. పవన్‌‌పై పేర్నినాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-06-17 11:44:02.0  )
Ap News: ముదిరిన ‘చెప్పు’ రాజకీయం.. పవన్‌‌పై పేర్నినాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ, జనసేన మధ్య చెప్పు రాజకీయం కొనసాగుతోంది.తనను బూతులు తిట్టడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పుడెప్పుడో చెప్పు చూపించి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దీనికి కౌంటర్‌గా మూడు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని రెండు చెప్పులు చూపించి పవన్ కల్యాణ్‌ను విమర్శించారు. అయితే ఆ చెప్పులు తనదేననని.. ఓ వైసీపీ నాయకుడు ఎత్తుకెళ్లాడని పవన్ కల్యాణ్ అంతేదీటుగా రిప్లై ఇచ్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో చెప్పు మాటల యుద్ధానికి ఆయుధంగా మారింది.

ఇక పవన్ కల్యాణ్ ఇచ్చిన చెప్పు రిప్లైపై పేర్ని నాని సైతం స్పందించారు. చెప్పులు పోయి మూడు రోజులు అయితే పవన్ ఇప్పుడు కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు. గతేదాడి గుడికి వెళ్తే అక్కడ తన చెప్పు పోయిందని.. అయితే గుడి ఎదురుగా జనసేన ఆఫీసు ఉందని.. పవన్ కల్యాణ్‌ను అనుమానిస్తామా అని వ్యంగ్యంగా విమర్శించారు. చెప్పులు పోతో ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తారని, కానీ జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు పోయిందని ఎద్దేవా చేశారు. చెప్పు గురించి కాకుండా ముందు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గుర్తుపై ఆలోచించాలని పేర్ని నాని హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed