- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైసీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు
దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా సోదరుడి నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు మంగళవారం ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. అంజుమన్ కమిటి అధ్యక్షుడుగా కొనసాగుతున్న కనుమ ఎమ్మెల్యే ముస్తఫా వ్యాపార లావాదేవీలన్నీ ఆయనే పర్యవేక్షిస్తుంటాడు. అయితే ఆకస్మాత్తుగా ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడి నివాసాల్లో ఐటీ సోదాలు చేపట్టడం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. ఇకపోతే ముస్తఫా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు సార్లు గెలుపొందారు.
రాజకీయాల్లో చురుగ్గా ఉండే ముస్తఫా ఇటీవలే తన రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని.. తన వారసురాలిగా కుమార్తె నూరి ఫాతిమా బరిలో నిలుస్తుందని ప్రకటించేశారు. అప్పటి నుంచి కుమార్తెను నియోజకవర్గం ప్రజలకు పరిచయం చేస్తున్నారు. తన వెంట కార్యక్రమాలకు తీసుకెళ్తూ ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ముస్తఫా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మానేసి వ్యాపార రంగంపై ఫోకస్ పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కుమార్తె నూరి ఫాతిమాను రాజకీయ వారసురాలిగా ప్రకటించారు.