ఎన్నికల్లో పోటీపై కొడాలి నాని సంచలన నిర్ణయం

by Disha Web Desk 16 |
ఎన్నికల్లో పోటీపై కొడాలి నాని సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీల రాజకీయం మరింత వేడెక్కింది. ప్రజలకు ఇచ్చిన హామీలపై అధికార వైసీపీ, టీడీపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. అంతేకాదు ఎవరి హయాంలో ఏం జరిగిందనేదానిపై ప్రశ్నించుకుంటున్నారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యహని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు వైసీపీ నేతలు సైతం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇక అభ్యర్థులైతే ఆయా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తున్నారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడివాడలో ఏం అభివృద్ధి చేశారని సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని ఆయన ప్రశ్నించారు.

దీంతో వెనిగండ్ల రాము వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. గుడివాడ నియోజకవర్గంలో అర్హులందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. అర్హత ఉండి ఇళ్ల స్థలం రాలేదని ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో తాను పోటీ చేయనని సవాల్ చేశారు. టీడీపీ హయాంలో గుడివాడలో ఒక్క ఎకరం కూడా పేదలకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. జగన్ పాలన దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ అని వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed