Jagan Mohan Reddy కోసం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సంచలన నిర్ణయం

by srinivas |   ( Updated:2022-11-25 15:20:33.0  )
Jagan Mohan Reddy కోసం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో వారసులు కంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే క్లారిటీ సైతం ఇచ్చేశారు. ఇందులోనూ సర్వే ఫలితాలను సైతం ముడిపెట్టారు. సర్వేల్లో సానుకూల రిపోర్ట్ వచ్చిన వారికే టికెట్ ఇస్తామని.. వారసులకు ఈసారి టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో కొందరు ఎమ్మెల్యేలు తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటిస్తూ వస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ పోటీ చేయనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవలే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా ప్రకటించారు. ఆమె పోటీ చేస్తారని స్వయంగా ప్రకటించారు.

తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌కు కూడా తెలియజేసినట్లు తెలిపారు. వయో భారంతోపాటు గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్నానని ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పినట్లు వెల్లడించారు. అంతేకాదు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల జనంలో ఎక్కువ సేపు తిరగలేకపోతున్నానని, ప్రజలతో మాట్లాడలేకపోతున్నట్లు తెలిపారు. సమావేశాలలో కూడా ఎక్కువ సేపు ఉండలేకపోతున్నట్లు చెప్పారు. అయితే తన వారసుడు జగన్‌మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

అయితే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సర్వే జరుగుతుందని, దాని ప్రకారం టికెట్ ఇచ్చే అంశంపై తేల్చుతానని సీఎం జగన్ తనతో చెప్పినట్లు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి తెలిపారు. సర్వేలో తన కుమారుడికి పాజిటివ్‌గా వస్తే అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులు..

Advertisement

Next Story