- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: జడ్పీటీసీని బూతులు తిట్టిన వైసీపీ మంత్రి సోదరుడు..
దిశ డైనమిక్ బ్యూరో: అధికారం చేతిలో ఉందని.. తాను ఏం చేసినా.. ఎవర్ని ఎమన్నా సాగుతోందనుకుని ఓ వైసీపీ మంత్రి సోదరుడు ఓ జడ్పీటీసీని బూతులు తిడుతూ.. డబ్బులిచ్చి చంపిస్తా అని ఫోన్ లో బెదిరించారు. ఈ నేపథ్యంలో మంత్రి తమ్ముడుతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ ను ఆ జడ్పీటీసీ మీడియా ముందు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరు మంత్రి గుమ్మనూరు జరాయం సోదరుడు గుమ్మనూరు నారాయణ కర్నూలు జిల్లా అస్పరీ ZPTC దొరబాబును ఫోన్ లో బెదిరించారు.
మా అన్న జయరాంని విమర్శించేంత వాడివా నువ్వు అంటూ దుర్భాషలాడారు. మంత్రిని తాను ఏమి అనలేదని దొరబాబు ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా నారాయణ వినిపించుకోలేదు. ఫోన్ లో దొరబాబును బూతులు తిడుతూ బెదిరింపులకు దిగారు. అప్పుడే నిన్ను నరికించెయ్యాల్సింది.. వదిలేసి తప్పు చేశా.. రెండు నెలలు ఆగు నీ అంతు చూస్తా అని బెదిరించారు. తాను ఏమి అననలేదని దొరబాబు ఎంత చెప్పిన వినిపించుకోలేదు. ఇంకిత జ్ఞానం లేడకుండా పచ్చిబూతులు తిట్టారు.
తాను జయరాంని విమర్శించలేదని దొరబాబు ఎంతగా మొరపెట్టుకున్నా నారాయణ వినిపిచ్చుకోకుండా దుర్భాషలాడడంతో ఆగ్రహానికి లోనైన దొరబాబు మాటకు మాట చెప్పారు. ఇరువురు ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. ప్రస్తుతం ఇరువురి సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. కాగా ఘటనపై తీవ్ర ఆగ్రహానికి గురైన ZPTC దొరబాబు, ఈ విషయంపై వైసీపీ అధిష్టానంతో పాటు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు రాజకీయవర్గాల సమచారం.
ఇక ప్రస్తుతం ఇరువురి సంభాషణకు సంబంధించిన ఫోన్ కాల్ ఆడియో బయటకు రావడంతో.. ఆ ఆడియో విన్న పలువురు నేతలు సొంత పార్టీ నేతలను ఇలా బెదిరించడం, దుర్భాషలాడడం ఏంటని ఫైర్ అవుతున్నారు.