పవన్ కల్యాణ్ నివాసానికి వైసీపీ ఎంపీ.. కాసేపట్లో చేరిక తేదీ ప్రకటన

by GSrikanth |
పవన్ కల్యాణ్ నివాసానికి వైసీపీ ఎంపీ.. కాసేపట్లో చేరిక తేదీ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ రాదని తెలిసిన కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు ఏమాత్రం ఆలోచించకుండా కండూవా మార్చడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి.. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మచిలీపట్నం అధికార వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసంలో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. వైసీపీలో ఇమడలేక జనసేనలో చేరేందుకు బాలశౌరి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా పవన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం జనసేన పార్టీలో ఎప్పుడు చేరేది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు బాలశౌరి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story