- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:కూటమి ప్రభుత్వం పై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వివరాల్లోకి వెళితే.. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూటమి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై కూడా సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయోచ్చు కదా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎద్దెవా చేశారు. రాష్ట్రంలో మహిళల, బాలికపై అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం లోని పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. అంతేకాదు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు, అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు. సుగాలి ప్రీతి, చిత్తూరు జిల్లా మైనర్ బాలిక కేసు ఏమైంది? అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలపై హింసకు పాల్పడుతూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారు అని ఆయన ఫైర్ అయ్యారు.