- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎప్పుడు పుట్టామన్నది కాదురా బై.. ఏం చేశామన్నదే ముఖ్యం.. సీబీఎన్ కు స్ట్రాంగ్ కౌంటర్..
దిశ వెబ్ డెస్క్: తాజాగా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బచ్చాగా ఉన్నప్పుడు గోళీలు ఆడుకుంటున్నప్పుడు తాను తాను ముఖ్యమంత్రి అయినట్లు పేర్కొన్నారు. ఇక మీ నాన్న కంటే ముందు నేనే ముఖ్యమంత్రి అయ్యాను అంటూ జగన్ ను ఎద్దేవ చేశారు.
ఒక సారి చరిత్ర తిరగరాయమని జగన్ కి సూచించారు. కాగా చంద్రబాబు వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. ఎప్పుడు పుట్టమన్నది కాదు ఏం చేశామన్నది ముఖ్యమని పేర్కొన్నారు. మర్రి చెట్టు, తాటి చెట్టులాగా వందల సంవత్సరాల క్రితం పుట్టాల్సిన అవసరం కానీ, వేళా సంవత్సరాలు బ్రతకాల్సిన పనికాని లేద్దని చంద్రబాబును నాని ఎద్దేవ చేశారు.
పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసావని ప్రశ్నించారు. ఇక నువ్వు అధికారంలో ఉన్నపుడు ఎప్పుడైనా వికాలాంగులకు, ముసలివాళ్లకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇద్దామనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అని మండిపడ్డారు. నీకు ఆ ఆలోచన రాలేదు, రాదు, ఎందుకంటే నువ్వు ఓ పెత్తందారు మనస్తత్వం కలిగిన వ్యక్తివి అని చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. అలానే చంద్రబాబు ప్రజలను ఓట్లుగా చూస్తారే తప్ప మనుషులుగా చూడరు. అందుకే ఆ ఆలోచన రాలేదు అని నాని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.