- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఘటనపై సజ్జల తీవ్ర ఆవేదన
దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం(Mangalagiri TDP Central Office)పై దాడి కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(YCP leader Sajjala Ramakrishna Reddy) 120వ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో సజ్జలను పోలీసులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. దీంతో తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశద్రోహం కేసు అన్నట్టుగా విచారిస్తున్నారని తెలిపారు. సీఐడీతో విచారణ చేయించాలంటున్నారని, ఏం తేలుస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకూ జరిగింది విచారణ కాదా అని నిలదీశారు. తనకు అక్టోబర్ 25 వరకు హైకోర్టు ప్రొటెక్షన్ ఉందని చెప్పారు. ప్రభుత్వం అరాచకానికి పాల్పడుతోందని మండిపడ్డారు. 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే కేసు ముగిసే సమయానికి నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. తాను విదేశాలకు వెళ్లానని తెలిసి పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారని సజ్జల తెలిపారు. అక్టోబర్ 7న విదేశాలకు వెళితే 10న నోటీసులు ఇచ్చారని వెల్లడించారు.తమకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని, దేశం విడిచిపోవాల్సిన అవసరం తమకు లేదని సజ్జల స్పష్టం చేశారు. నటి జత్వానీ కేసులో జగన్‌పై స్టేట్‌మెంట్ ఇప్పించారని చెప్పారు. కావాలనే కేసును సీఐడీకి అప్పగించారని సజ్జల వ్యాఖ్యానించారు.