- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌ను చంపేందుకు కుట్ర.. పోసాని సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌ను చంపేందుకు కుట్ర చేస్తున్నారని నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను చంద్రబాబు పబ్లిక్‌గా చంపుతామని అంటున్నారని, అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ.. ఏపీ సీఎం ప్రాణానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. చాలా రోజులుగా జగన్‌ను హత్య చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ చంపుతానన్న వీడియోలు ప్రధాని మోడీ, అమిత్ షా చూడలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఒక్కరైనా ఖండిచారా..? అని నిలదీశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని హత్యలు చేసినా ఓకేనా అని వ్యాఖ్యానించారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్ ఆర్థిక నేరస్తులని పోసాని ఆరోపించారు. చంద్రబాబు హంతకుడని సుజానా, సీఎం రమేశ్ పార్టీ మారారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై కేంద్రం ఎందుకు స్పందించదన్నారు. జగనే రాయి వేయించుకన్నట్లు పవన్ కల్యాణ్ చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీతో పొత్తుకుంటే చంద్రబాబు దేవడయ్యారా..? అని నిలదీశారు. దేశంలోనే నెంబర్ వన్ డాన్ చంద్రబాబు అని పోసాని తీవ్ర విమర్శలు చేశారు.