పాడేరు ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ.. ఉప ఎన్నిక‌పై దిశానిర్దేశం

by srinivas |
పాడేరు ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ.. ఉప ఎన్నిక‌పై దిశానిర్దేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు ఆ స్థానానికి ఆగస్టు 30న ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను వైఎస్ జగన్ ప్రకటించారు. ఎలాగైనా సరే ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. అటు టీడీపీ అభ్యర్థిగా పీలా గోవింద్ ను ప్రకటించడంతో ఎన్నికల వ్యూహానికి మరిత పదును పెట్టారు. విశాఖ జిల్లా పరిధిలోని వైసీపీ ప్రజాప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులను కలిశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ దిశానిర్దేశం చేశారు.

Advertisement

Next Story