- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాణికి పోటీగా దీక్షను దిగనున్న మాధురి.. పీక్ స్టేజ్‌కు దువ్వాడ ఫ్యామిలీ వివాదం
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం ముదిరి పాకాన పడింది. దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళ మాధురితో అక్రమంగా ఉంటున్నారని భార్య వాణి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పంచాయితీ సంచలనంగా మారింది. దువ్వాడ వాణి, మాధురి మధ్య మాటల యుద్ధం పెరిగింది. మాధురి పిల్లలకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించాలని వాణి డిమాండ్ చేశారు. ఇందుకు కౌంటర్‌గా వాణి పిల్లలకు చేయిస్తే తాను చేయిస్తానని మాధురి కౌంటర్ ఇచ్చారు.
తాను అదే ఊరిలో ఉండి రాజకీయాలు చేస్తానన్న మాధురి.. వాణి నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు. తన పిల్లలను వివాదంలోకి లాగిన వాణి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే వాణి ఆందోళన చేసిన చోటనే తానూ ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఇందుకోసం ఆదివారం ఉదయం తాను టెక్కలి వెళ్తానని మాధురి చెప్పారు. తనపై దాడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానన్నారు. వివాదంలోకి తన పిల్లలను ఎందుకు లాగారని ప్రశ్నించారు. క్షమించమని కోరితేనే తాను దీక్ష విరమిస్తానని తెలిపారు. తనకు ఏది జరిగినా వాణినే బాధ్య వహించాలన్నారు. వాణి మానసిక స్థితిపై వైద్య పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తాను దువ్వాడ శ్రీనివాస్ వెంటే ఉన్నానని మాధురి స్పష్టం చేశారు. తనను ఊరి నుంచి తరమడానికి వాణి ఎవరని ప్రశ్నించారు. తనపై వాణి చేసిన ఆరోపణలపై లీగల్‌గా ఫైట్ చేస్తానని మాధురి హెచ్చరించారు.