- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: సూళ్లూరుపేట వైసీపీ అభ్యర్థిగా మళ్లీ ఆయనే.. లైన్ క్లియర్ చేసిన విజయసాయిరెడ్డి
దిశ, వెబ్ డెస్క్: సూళ్లూరుపేట వైసీపీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్యను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో సంజీవయ్యను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. కాగా ఎన్నికల వేళ సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. వైనాట్ 175 అంటూ సంచలన ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే 68 నియోజకవర్గాలకు కొత్తగా వైసీపీ ఇంచార్జులను నియమించారు. ఇప్పటి వరకూ 4 విడతలుగా జాబితాను విడుదల చేశారు. తాజాగా మరికొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారు. ఐదో లిస్టు అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతోంది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స ఆధ్వర్యంలో ఐదో లిస్టు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే సూళ్లూరుపేట అభ్యర్థిపై చర్చించి ఓ నిర్ణయం వచ్చారు. కిలివేటి సంజీవయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఆయనకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కిలివేటి సంజీవయ్యనే 2024 ఎన్నికల అభ్యర్థిగా స్పష్టం చేశారు.