- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైసీపీ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల షెడ్యూల్(Election Schedule) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలపై వైసీపీ(YCP) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులకు నిరసనగా.. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు(boycotted) ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని (former minister's name is Nani) ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ(TDP) పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని.. ఇందులో భాగంగా తమ పార్టీ నేతలను, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తోందని.. ఈ పరిస్థితుల్లో తాము ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే ఈ ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలను ప్రభుత్వం ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఇదిలా ఉంటే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC) ఎన్నికలకు సంబంధించిన అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6 వరకు ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలని తెలిపింది. అలాగే ఓటర్ల నమోదు ముగిసిన వెంటనే ఈ నెల 23న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేయనున్నారు. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 9 వరకు మళ్లీ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీటిపై డిసెంబర్ 25 తేదీకి స్క్రూటినీ పూర్తి చేసి, నవంబర్ 30న పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు. అనంతరం పట్టభద్రుల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.