ఇలా వ్యవహరించినందుకే ఓడిపోయాం..అయినా బుద్ధి రాలేదు.. జగన్‌పై వైసీపీ కార్యకర్తల ఆగ్రహం

by Aamani |   ( Updated:2024-08-03 05:05:02.0  )
ఇలా వ్యవహరించినందుకే ఓడిపోయాం..అయినా బుద్ధి రాలేదు.. జగన్‌పై వైసీపీ కార్యకర్తల ఆగ్రహం
X

దిశ,వెబ్‌డెస్క్ : ఒక నాయకుడు విజయం సాధించాడు అంటే కార్యకర్తల కృషి ఎంతో ఉంటుంది.ఓడినా, గెలిచినా నాయకుడి అడుగు జాడల్లోనే పని చేస్తుంటారు. అలా నాయకులకు కార్యకర్తలకు ఐక్యత బలంగా ఉంటుంది. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చిన నాయకుడు అండగా ఉంటాడు. కానీ తాడేపల్లిలో జగన్ క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలకు చుక్కెదురైంది.

శుక్రవారం వైకాపా కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి తాడేపల్లి కి చేరుకున్నారు. జగన్ గతంలో సీఎంగా ఉన్నప్పటిలాగే ఇప్పుడూ ముందస్తు అపాయింట్మెంట్ ఉన్నవారినే క్యాంపు కార్యాలయంలోకి అనుమతించారు. మిగిలిన కార్యకర్తలను లోపలికి అనుమతించలేదు. వారాంత పార్టీ కోసం పనిచేసినవారు.. కష్టనష్టాల కోర్చినవారు. అయినా గడిచిన ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్ దరిదాపుల్లోకి రావడానికి కూడా అనుమతి లేదు. భద్రత పేరుతో ఇన్నాళ్లూ సృష్టించిన వలయాలన్నింటినీ తొలగించడంతో ఇప్పుడు వారు ప్యాలెస్ గేటు వరకు రాగలిగారు. కానీ, భద్రతా సిబ్బంది లోపలికి రానివ్వకుండా దురుసుగా ప్రవర్తించారు. ఒక కార్యకర్త లోపలున్న వారితో సెల్ ఫోన్లో మాట్లాడిస్తా అనుమతించమని ముందుకొచ్చాడు. జగన్ భద్రతా సిబ్బందిలో ఒక్కరు అతని సెల్ ఫోన్ లాక్కుని దూరంగా విసిరేశాడు. పార్టీ కోసం పనిచేసిన మాకు ఇలాంటి ఛీత్కారాలా? ఆ ఐదేళ్లూ ఇలా వ్యవహరించినందుకే ఓడిపోయాం. అయినా బుద్ధి రాలేదు' అంటూ అక్కడున్న కార్యకర్తలు విమర్శించారు. 'రావాలి జగన్.. మమ్మల్ని కలవాలి జగన్' అంటూ వారు చేసిన నినాదాలు చేశారు. భద్రత సిబ్బంది కార్యకర్తలందరినీ తరిమేశారు. దీంతో వారంతా శాపనార్థాలు పెట్టుకుంటూ వెనుదిరిగారు. అక్కడున్న కార్యకర్తల్లో కొందరు ఈ సంఘటనను వీడియోలు, తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాసేపటికే అవి తెగ వైరల్ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed