World Record: ప్రపంచ రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ శాఖ..

by Kavitha |
World Record: ప్రపంచ రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ శాఖ..
X

దిశ, డైనమిక్​బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్‌ను ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ డిప్యూటీ సీఎంకు అందజేశారు. కాగా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది. అందులో భాగంగా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి.. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed