- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి మహిళా అఘోరి హల్‌చల్.. ఇలాంటి వారే అత్యాచారం చేసి సారీ చెబుతారంటూ ఫైర్
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం తర్వాత వార్తల్లోకి ఎక్కిన మహిళ అఘోరి(Woman Aghori).. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. వారం రోజుల క్రితం.. కొండగట్టు, వేములవాడ ఆలయాలను సందర్శించిన ఆమె.. తాను సనాతన ధర్మం(Sanatana Dharma) కోసం ఆత్మార్పణ(submission) చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను రెండు రోజుల పాటు గృహనిర్బంధం చేశారు. అనంతరం ఆమెను మహారాష్ట్రకు తరలించారు. దీంతో అంతా మామూలుగా ఉందనుకునే లోపు మరోసారి మహిళ అఘోరి హల్‌చల్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి సమీపంలో ఉన్న నక్కపల్లి టోల్ గేట్(Nakkapally Toll Gate) సిబ్బందితో ఆమె గొడవకు దిగింది. దాదాపు రెండు గంటలపాటు హైడ్రామా సాగింది.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టోల్ గేట్ సిబ్బంది తన శరీరాన్ని తాకడమే కాకుండా.. సారీ చెబుతున్నారు.. ఇలాంటి వారే.. మహిళలు, పిల్లలు అని తేడా లేకుండా అత్యాచారాలు చేసి.. సారీ చెబుతారని మండిపడ్డారు. అలాగే.. నాగసాధువు అయిన తనకు రక్షణ లేకపోతే.. మహిళల పరిస్థితి ఏంటని.. ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్లే కలియుగం ఇలా మారిపోయిందని, తాను సనాతన ధర్మం కోసం పోరాడుతూనే ఉంటానని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం( ready to sacrificelife)గా ఉన్నానంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆమోకు నచ్చజెప్పి అక్కడినుంచి పంపించినట్లు తెలుస్తోంది.