కొడాలి నాని మంత్రి పదవికి రాజీనామా చేస్తారా: మాజీ మంత్రి దేవినేని

by Disha News Desk |   ( Updated:2022-01-30 14:16:18.0  )
కొడాలి నాని మంత్రి పదవికి రాజీనామా చేస్తారా: మాజీ మంత్రి దేవినేని
X

దిశ, ఏపీ బ్యూరో: క్యాసినో వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన సీఎం జగన్‌, మంత్రి కొడాలి నాని ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాసినో పెట్టినట్లు స్వయంగా మంత్రే ఒప్పకు న్నారన్నారు. క్యాసినో పై మాటలతో దొరికిపోయిన నాని, మంత్రి పదవికి రాజీనామా చేస్తారో? లేక పెట్రోల్‌ పోసుకుంటారో అని ఎద్దేవా చేశారు. గుడివాడలో సంక్రాంతి సందర్భంగా కే-కన్వెన్షన్‌లో క్యాసినో నిర్వహించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, పెట్రోల్‌ పోసుకుంటానని సవాల్‌ విసిరారు.. మరి ఇప్పుడు ఏం చేస్తారని దేవినేని నిలదీశారు.

Advertisement

Next Story