వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా...గెలుపు గుర్రాలకే టికెట్లు: వైవీ సుబ్బారెడ్డి

by Seetharam |
YV Subbareddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. గత ఎన్నికల్లో దూరంగా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే తాను అక్కడ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

Advertisement

Next Story