పవన్ కల్యాణ్ పిలవాలే కానీ ఎక్కడికైనా వెళ్తా.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2024-04-30 16:01:55.0  )
పవన్ కల్యాణ్ పిలవాలే కానీ ఎక్కడికైనా వెళ్తా.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ఎన్నికల బరిలో గెలుపొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మే 13వ తేదీన పోలీంగ్ ఉండగా.. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. ఇక ఎన్నికల సమయం కూడా దగ్గరపడటంతో అన్ని పార్టీలు ప్రచారాల్లో జోరు పెంచాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి ఖుష్బు సుందర్ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సీనియర్ హీరోయిన్ ఖుష్బు సుందర్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించి ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉంది. ఖుష్భు మహిళా చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అన్యాయాలు, అక్రమాలపై పలు పోస్టులు షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘త్వరలో నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటాను. పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా టైంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని తెలుసు. కానీ అయన ఎప్పుడూ పాలిటిక్స్ గురించి నా దగ్గర చర్చించలేదు. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయన పిలిస్తే ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది ఖుష్బు.

Read More...

తమ్ముడి పక్కన హీరోయిన్‌గా చెయ్యాలనేది తన కోరిక.. నటి షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed