Conocarpus:ఆ చెట్లు పెంచొద్దని ఏపీ సర్కార్ ఎందుకు చెబుతుందంటే..అసలు కారణం ఇదే?

by Jakkula Mamatha |   ( Updated:2024-08-31 14:23:53.0  )
Conocarpus:ఆ చెట్లు పెంచొద్దని ఏపీ సర్కార్ ఎందుకు చెబుతుందంటే..అసలు కారణం ఇదే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనోకార్పస్ చెట్లు ప్రమాదకరమని, వాటిని పెంచొద్దని తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెట్ల పై చర్చలు జరుగుతున్నాయి. ఈ చెట్లను ఎందుకు అంత హానికరం అంటున్నారు? వీటి వల్ల మనుషులకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే దేశంలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. అందులో ఈ కోనో కార్పస్ మొక్కలు కూడా ఒకటి. ఈ మొక్కలు నాటిన తర్వాత పెద్ద చెట్లుగా ఎదుగుతాయి. ఇవి మన దేశానికి చెందినవి కాదు. ఇవి అన్య జాతుల మొక్కలు.

అరబ్ దేశాల్లో కోనో కార్పస్ చెట్లను విరివిగా పెంచేవారు. కొంత కాలం తర్వాత ఈ మొక్కలు మానవులకు ఎంతో అనారోగ్యాన్ని కలిగిస్తాయని, పర్యావరణానికి హానికరం అని తెలుసుకున్న అరబ్ దేశాలు కోనో కార్పస్ చెట్లను నరికించేశాయి. అప్పటి నుంచి ఈ మొక్కలను నిషేధించాయి. గుజరాత్‌లో కూడా ఈ మొక్కలు నిషేధింపబడ్డాయి. ప్రజెంట్ ఏపీ రాష్ట్రం కూడా ఈ మొక్కలను నిషేధించాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణం పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆ మొక్కలను నాటి వద్దని చెప్పారు.

కోనోకార్పస్ చెట్ల వల్ల కలిగే హాని..

*కోనో కార్పస్ చెట్ల వల్ల పర్యావరణానికి, మానవులకు ఎంతో నష్టం జరుగుతుంది.

*ఈ చెట్లు ఎక్కువగా పెంచినట్లయితే అవి బాష్పీభవన ప్రక్రియను వేగవంతం చేస్తాయి. దాని వేళ్ళు భూమిలో ఉన్న డ్రైనేజ్ పైపులను కూడా నాశనం చేస్తాయి. ఈ మొక్క రెండు సంవత్సరాల్లో రెండు సార్లు పరాగసంపర్కం చేస్తుంది. ఇది మానవ ఆరోగ్యానికి ఎంతో హానికరం అని చెబుతున్నారు.

*ఈ మొక్కలు పరాగసంపర్కం చేసేటప్పుడు వచ్చే పుప్పొడి మనుషుల్లో దగ్గు, జలుబు, ఉబ్బసం, శ్వాసకోశ రుగ్మతలు అధికంగా వచ్చేలా చేస్తాయి.

*ఆస్తమా పేషెంట్లు ఈ చెట్ల దగ్గర ఉండటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు.

*వీటిని ఒక్కసారి నాటమంటే అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకొని పెరిగేస్తాయి. ఎక్కువ నీరు కూడా అవసరం లేదు.

*ఈ చెట్లు అధికంగా నాటితే భూగర్భ జలాల నిల్వలు కూడా తగ్గిపోతాయి. ఈ మొక్కలు పెంచడం వల్ల నీటి కొరత వచ్చే అవకాశం ఎక్కడైనా ఎక్కువే అని పరిశోధకులు చెబుతున్నారు.

*ఈ చెట్ల ఆకులను పక్షులు కానీ జంతువులు కానీ తినవు. వీటి రుచి జంతువులకు నచ్చదు.

Advertisement

Next Story

Most Viewed