Pawan Kalyan:సింగపూర్ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-20 14:37:31.0  )
Pawan Kalyan:సింగపూర్ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా సమాచారం ప్రకారం సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం సాధించిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే..పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ సింగపూర్‌‌కు వెళ్లినట్లు సమాచారం. అన్నా లెజినోవా అక్కడి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ పట్టా పొందారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. తన భార్య పట్టా అందుకోవడానికి వెళుతున్నా క్రమంలో ఆమె వెనుకలే పవన్ కళ్యాణ్ వెళుతున్న వీడియోను పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అన్నా లెజినోవా పట్టా అందుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story