షర్మిల ఏపీ పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్.. ఆదివారం నుండి చీఫ్ గా బాధ్యతలు

by Indraja |   ( Updated:2024-01-19 13:03:46.0  )
షర్మిల ఏపీ పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్.. ఆదివారం నుండి చీఫ్ గా బాధ్యతలు
X

దిశ వెబ్ డెస్క్: వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలను చేజిక్కించుకున్న విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా భాద్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా వెల్లడయ్యింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20, 21 తేదీల్లో ఆమె రాష్ట్రంలో పర్యటిస్తారు.

ఈ పర్యటనలో భాగంగా షర్మిల ఈ నెల 20 వ తేదీన హైదరాబాద్ నుండి కడపకు ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి సాయంత్రం 4 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. ఆ తరువాత మొదటగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. ఆ రోజు రాత్రి ఆమె అక్కడే బస చేయనున్నారు. ఇక 21 వ తేదీ ఉదయం ఆమె ప్రత్యేక విమానంలో కడప నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తరువాత 21 వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.

Read More..

అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ.. అంటరానితనంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story