- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో 46 ఏళ్లుగా అదే సెంటిమెంట్.. ఈసారీ ఆ పార్టీదేనా అధికారం..?
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న కౌంటింగ్ జరగబోతోంది. ప్రధానంగా వైసీపీ, కూటమి మధ్యే గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనన్న ఉత్కంఠ అందరిలో ఉంది. అయితే ఆ నాలుగు స్థానాల్లో ఏ పార్టీ గెలుస్తుందో అదే అధికార పీఠం దక్కించుకుంటుందనే సెంటిమెంట్ వినిపిస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో భీమవరం, ఏలూరు, ఉంగుటూరు, పోలవరంలో ఏ అభ్యర్థులు అయితే గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే బలమైన సెంటిమెంట్ ఉంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటివరకూ అదే జరిగింది.
భీమవరం, ఏలూరు, ఉంగుటూరు, పోలవరంలో 1978లో కాంగ్రెస్, 1983, 85లో టీడీపీ, 1989లో కాంగ్రెస్, 1994, 99లో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ గెలిచాయి. అధికార పీఠాన్ని దక్కించుకున్నాయి. ఇప్పుడు కూడా ఏ పార్టీ అయితే ఈ నాలుగు చోట్ల గెలుస్తుందో ఆ పార్టీ అధినేతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని పలువురు అంటున్నారు. ఇప్పవరకూ ఆ నాలుగు చోట్ల గెలిచిన పార్టీనే అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కలను చూస్తే అదే సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకూ ఆగాల్సిందే.
Read More : చంద్రబాబే ముఖ్యమంత్రి.. తేల్చేసిన జనసేన కీలక నేత