చంద్రబాబుకు లక్షల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి?: ఎంపీ విజయసాయిరెడ్డి

by Seetharam |   ( Updated:2023-09-24 12:49:13.0  )
చంద్రబాబుకు లక్షల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి?: ఎంపీ విజయసాయిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్‌లో ఉన్నా వైసీపీ నేతలు మాత్రం వదలడం లేదు. ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. స్కిల్ స్కామ్ కేసు జస్ట్ శాంపిల్ అని ఇంకా తవ్వినకొద్దీ చంద్రబాబు అక్రమాలు బయటకు వస్తాయని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 40 ఏళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూనే ఉన్నాడు. ఢిల్లీ వెళ్లి ఆర్తనాదాలు చేస్తున్న వారికి, కొవ్వొత్తుల ప్రదర్శకులకు తెలియదా ఆయన సంపాదన రహస్యం ఏమిటో?’ అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కూ.371 కోట్ల స్కిల్ స్కాంకు పాల్పడ్డాడు. తవ్వేకొద్దీ బయటికొచ్చే ‘ఆస్తి’కలెన్నో’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Read More Andhra Pradesh News updates

Advertisement

Next Story