జగన్ బొమ్మ కనిపించగానే చెప్పులు విసిరారు

by Ramesh Goud |   ( Updated:2024-02-09 16:47:31.0  )
జగన్ బొమ్మ కనిపించగానే చెప్పులు విసిరారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. అంతేగాక రాష్ట్రమంతా వివిధ పార్టీలకు సంబందించిన ఫెక్షీలు ఏర్పాటు చేయడంతో పాటు టీవీల్లో, సినిమా థియేటర్లలో అడ్వర్టైజ్‌మెంట్ ల ద్వారా కూడా తెగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే సినిమా హాల్లో ప్రదర్శించిన పార్టీ అడ్వర్టైజ్‌మెంట్ పై చెప్పులు వర్షం కురిసింది. ఈ ఘటన తిరుపతిలోని కృష్ణ తేజ థియేటర్ లో జరిగింది. సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే యాడ్ లలో భాగంగా జగన్ పథకాలకు సంబందించిన అడ్వర్టైజ్‌మెంట్ ను హాల్ యాజమానులు ప్రదర్శించారు. అందులో జగన్ బొమ్మ కనిపించగానే ఆగ్రహానికి గురైన ప్రేక్షకులు చెప్పులు విసరడం మొదలు పెట్టారు. జై పవన్, జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. దీంతో కాంగారు పడ్డ థియేటర్ సిబ్బంది, ఆ యాడ్ నే కాదు.. సినిమా స్క్రిన్ కూడా ఆపేశారు. ప్రేక్షకులు శాంతించాక మళ్లీ సినిమా ప్రదర్శన మొదలుపెట్టారు.

Advertisement

Next Story