ఊరకుక్కలకంటే అధ్వాన్నంగా మాట్లాడితే ఎలా?: టీడీపీ సభ్యులపై డిప్యూటీ సీఎం ఫైర్

by Seetharam |   ( Updated:2023-09-22 07:24:14.0  )
ఊరకుక్కలకంటే అధ్వాన్నంగా మాట్లాడితే ఎలా?: టీడీపీ సభ్యులపై డిప్యూటీ సీఎం ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ సభ్యులు పట్టుబట్టగా స్పీకర్ అందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టిముట్టి నిరసన తెలిపారు. సైకో పోవాలి అంటూ నిరసన తెలిపారు. నందమూరి బాలకృష్ణ విజిల్స్‌ మోతమోగించారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సభలో స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఊర కుక్కలతో పోల్చారు. గ్రామాల్లో ఊర కుక్కల కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. అనంతరం టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వచ్చారు. ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

More Andhra Pradesh News

Advertisement

Next Story