- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసులు పెట్టి ఏం పీకుతారు?..మిమ్మల్ని ప్రజలు తన్నితరుముతారు: అచ్చెన్నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కన్నా వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను,అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు, ఇంకా కేసులు పెట్టి ఏం పీకుతారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాడిరైతుల ప్రగతికి కృషిచేసే ధూళిపాళ్ల నరేంద్ర.. రైతులపైనే దాడి చేయించారంటే ప్రజలు నమ్ముతారా? సంఘం డెయిరీని అక్రమించుకోవాలని ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. అది ఫలించకపోవడంతోనే దింపుడు కళ్ళం ఆశలా రైతులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు’ అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్ రెడ్డి...మీకు ఇంకా 5 నెలలే ఉంది ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి రాష్ట్రం నుంచి తన్ని తరుముతారు’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.