విషాదం.. ఇంటికి నిప్పంటుకుని దివ్యాంగుడు సజీవదహనం

by srinivas |   ( Updated:2025-01-06 03:57:17.0  )
విషాదం.. ఇంటికి నిప్పంటుకుని దివ్యాంగుడు సజీవదహనం
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) నల్లజర్ల(Nallajarla)లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి గ్రామంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. ఓ ఇంట్లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు మంటలు ఆర్పారు. అయితే ఇంట్లో నిద్రిస్తున్న దివ్యాంగుడు మృతి చెందారు. రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. కానీ కాపాడలేకపోయారు. మంటల్లో చిక్కుకుని దివ్యాంగుడు డానియేల్ కాలి బూడిదయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదంపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. డానియేల్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story