- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శివరాత్రి రోజు విషాదం..పట్టిసీమ వద్ద గోదావరిలో ముగ్గురు గల్లంతు
దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లాలో శివరాత్రి రోజున అపశృతి చోటు చేసుకుంది. పట్టిసీమ వద్ద వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్లిన ముగ్గురు భక్తులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. శివరాత్రి సందర్భంగా అరవింద్, లుక్మన్, రాంప్రసాద్ పట్టిసీమ వెళ్లారు. గోదావరి నదిలో స్నానం చేసి వీర భద్రస్వామిని దర్శించుకుందామనుకున్నారు. ఈ మేరకు గోదావరి నదిలో దిగారు. కొద్దిసేపటికే ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అయితే స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. వీరి కోసం గజ ఈతగాళ్లు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు గోదావరి వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
కాగా పట్టిసీమ వీరభద్రస్వామి ఉత్సవాలు శివరాత్రి రోజు మొదలై ఐదురోజుల పాటు జరుగుతాయి. గోదావరి నది మధ్యన చిన్న లంక మాదిరి ప్రదేశంలో వీరభద్రస్వామి దేవాలయం ఉంది. ఇక్కడికి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇక శివరాత్రి పండుగ రోజైతే వేలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు.