- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలువలోకి దూసుకెళ్లిన కారు.. తండ్రి కూతుళ్లను కాపాడిన యువకుడు
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రమాదంలో చిక్కుకున్న తండ్రికూతుళ్లకు ఓ యువకుడు చాకచక్యంగా కాపాడారు. తణుకు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో వెళ్తున్న కారు ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో కారు పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. అయితే కారు దూసుకెళ్లడం చూసిన స్థానిక యువకుడు వెంటనే కాలువలోకి దూకారు. కారు అద్ధాన్ని సుత్తితో పగులగొట్టి తండ్రి కూతుళ్లను ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. దీంతో యువకుడు రాంబాబు చేసిన సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు. వెంకటరాయపురానికి చెందిన తండ్రి, కూతుళ్ళు పండగ సందర్భంగా మండపాకలోని యల్లారమ్మ గుడికి వెళుతుండగా కారు అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రేన్ సాయంతో కాలువలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.