- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Crime News: అనుమానాలకు బలైన రెండు నిండు ప్రాణాలు.. కేసు ఛేదించిన పోలీసులు
దిశ ఏలూరు ప్రతినిధి: ముసునూరు మండలంలో ఈ నెల 3న జరిగిన జంట హత్య కేసును ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధాలు ఉన్నాయని తల్లి కూతుర్లను హతమర్చిన ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పదేళ్లుగా సహజీవనం
ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన మరియమ్మ పది సంవత్సరాల క్రితం భర్తతో విడిపోయారు. ఆ తర్వాత బొమ్ములూరుకు చెందిన దేవరపల్లి రవీంద్ర ఆలియాస్( రవీంద్ర)తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుండి మరియమ్మ, తన పిల్లలతో కలిసి రవీంద్రతోనే కాట్రేనిపాడు గ్రామంలో ఉంటున్నారు. ఐదు నెలల క్రితం నుంచి మరియమ్మ పై రవీంద్ర అనుమానం పెట్టుకుని తరచూ గొడవలు పడుతున్నారు. దీంతో రవీంద్రను మరియమ్మ ఇంట్లోకి రానివ్వడం లేదు.
గొడవలతో అనుమానం
అయితే మరియమ్మ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను ఇంట్లోకి రానివడంలేదని రవీంద్ర కోపం పెంచుకున్నారు. మరియమ్మ ను ఆమె కూతురును చంపాలనుకున్నాడు. స్నేహితుడితో కలిసి పథకం ప్రకారం దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో నిద్రపోతున్న మరియమ్మ, ఆమె కూతురిని సుత్తితో తలపై బలంగా కొట్టి చంపి పారిపోయారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడితో పాటు సహకరించిన వారిని కూడా అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.