- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొత్తు కుదిరిన వేళ బిగ్ షాక్.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలు..!
దిశ, వెబ్ డెస్క్: పొత్తు కుదిరిన వేళ టీడీపీకి కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఖరారు అయిన విషయం తెలిసిందే. అయితే పొత్తులో భాగంగా కొన్ని చోట్ల జనసేన, బీజేపీకి సీట్లు కేటాయించాల్సి వస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లా పోలవరం టికెట్‌ను తమకే ఇవ్వాలని స్థానిక టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ సీటు జనసేనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన నేతకు సీటు ఖరారు అయినట్లు ఇప్పటికే పొలవరం నియోజకవర్గంలో ప్రచారం సైతం జరుగుతోంది.
టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆందోళన
దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరంలో జనసేన కంటే టీడీపీ పోటీ చేస్తేనే గెలుపు సాధ్యమవుతుందని చెబుతున్నారు. అధికార వైసీపీని స్థానిక టీడీపీ నాయకుడైతే ఓడించగలడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమంటున్నారు. అంతేకాదు జనసేన అభ్యర్థికి సీటు ఇస్తే తామంతా మూకుమ్మడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం సీటును వదులుకోమని అంటున్నారు. మరి పోలవరం పంచాయితీని టీడీపీ అధినేత చంద్రబాబు ఏ విధంగా తెంచుతారో చూడాలి.