Janasena: ఎస్సీ పట్టా భూముల్లో మట్టి తవ్వకాలను అడ్డుకోండి

by srinivas |   ( Updated:2023-02-09 17:41:06.0  )
Janasena: ఎస్సీ పట్టా భూముల్లో మట్టి తవ్వకాలను అడ్డుకోండి
X

దిశ: కొత్తపేట: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఆలమూరు మండలం జొన్నాడ, చొప్పెల్ల గ్రామాల్లో ఎస్సీ పట్టా భూముల్లో మట్టిని యదేచ్ఛగా తవ్వకుంటున్నారు. అధికార పార్టీ నేతలే దళారీలుగా మారి మట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని జనసేన కొత్తపేట ఇంచార్జి బండారు శ్రీనివాస్ ఆరోపించారు. మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు

ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలమూరు మండలం జొన్నాడ, చొప్పెల్ల లంక గ్రామాలలో అధికార పార్టీ నేతల అండదండలతో లారీలు, టాక్టర్లతో మట్టి తరలించుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టా భూములు పంట పండించుకోవడానికి తప్ప.. మట్టి తవ్వకాలకు కాదన్నారు. కానీ సుమారు ఐదు నుంచి పది అడుగులు మేర తవ్వకాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లారీ మట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల రూపాయలు వరకూ అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. డివిజనల్ అధికారి వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలు అరికట్టాలని బండారు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

Nellore Rural లో పోటీకి ఎంపీ ఆదాల సై.. కోటంరెడ్డికి సవాల్

Advertisement

Next Story