భీమవరం సభలో పవన్‌పై సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు

by srinivas |
భీమవరం సభలో పవన్‌పై సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు
X

దిశ, భీమవరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ నాల్ లోకల్ అని, చంద్రబాబుకు దత్తపుత్రుడు అని సీఎం జగన్ విమర్శించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సభలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క వ్యక్తి సీఎం కావాలని పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. ‘దేశంలో ఎవరూ ఇలా ఉండరు. చంద్రబాబు సీఎం అయితే చాలు అనుకుంటున్నారు. చంద్రబాబు కోసమే పవన్ జీవితం. ఈ దత్తపుత్రుడికి పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఒకే. ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అంటూ త్యాగాల త్యాగరాజును ఈ దత్తపుత్రుడిలో చూస్తాం.’ అని సీఎం వ్యాఖ్యానించారు. పవన్‌కు స్త్రీల విలువ తెలియదు. ఇలాంటి నాయకులని స్ఫూరిగా తీసుకుంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి?. వారికి ఓటు వేయడం ధర్మమేనా?. రెండు విషాలు కలిస్తే అమృతం తయారు అవుతుందా?. ఒకరేమో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు. ఆ తరువాత మోసం చేస్తారు. ఇలాంటి వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు..ప్యాకేజీ కోసం తన వారిని తాకట్టు పెడుతున్న దత్తపుత్రుడి కుటిల నీతి వల్ల ఏ ఒక్క పేద కులమైనా ఎదిగిందా?. ఇలాంటి క్యారెక్టర్ , విశ్వసనీయత లేని వ్యక్తులతో ప్రజలకు మంచి జరుగుతుందా?. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 14 ఏళ్లు అధికారంలో వున్న చంద్రబాబు కనీసం చెప్పుకోటానికి ఒక మంచి పథకం కూడా అమలు చేయలేదని సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed