ఏపీలో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్

by Prasanna |   ( Updated:2024-02-03 13:24:12.0  )
ఏపీలో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
X

దిశ,వెబ్ డెస్క్ : గత రెండు రోజుల నుంచి ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఒక రోజు ఎండగా ఉంటే.. ఇంకో రోజు వాతావరణం చల్లగా మారుతుంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం ఎండలు మండిపోతున్నాయి. ఇలా ఏపీలో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. అక్కడక్కడా తేలికపాటి వానలు కురుస్తున్నాయి. సోమవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూల, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి అంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పగలంతా ఎండ తీవ్రంగా ఉంటోంది. సాయంత్రం కాగానే చలిగాలులు వీస్తున్నాయి.అక్టోబరు నెలాఖరు అయినా సరే పగటి పూట ఎండాకాలాన్ని తలపిస్తోంది. అక్టోబరు నెల సాధారణంగా మంచి వర్షపాతం నమోదు కావాలి.. కానీ ఈ ఏడాది ఎండాకాలం తరహాలో ఉదయం నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. జనాలకు ఉక్కపోత తప్పడం లేదు.

Advertisement

Next Story