భవిష్యత్తులో రైల్వే నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తాం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

by Shiva |
భవిష్యత్తులో రైల్వే నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తాం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : భవిష్యత్తులో దేశంలో రైల్వే నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన గుంటూరు పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరు నుంచి మూడు అత్యాధునిక రైళ్లను ప్రారంభించామని తెలిపారు. అందులో గుంటూరు నుంచి విశాఖ, నర్సాపూర్ నుంచి హుబ్లీ, రేణిగుంట నుంచి కడప రైళ్లు ఉన్నాయి. రైల్వే లైటింగ్ సిస్టమ్ కోసం కేంద్రం ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయడండా నిధులు ఖర్చు చేస్తుందని తెలిపారు. ఏపీలో అన్ని రైల్వే లైన్లను ఎలక్ర్ట్రికల్‌గా మార్చేశామని పేర్కొన్నారు. దాదాపు 400 కి.మీ న్యూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు ఏపీలో చేపట్టామని పేర్కొన్నారు. వచ్చే పదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్ వన్ రైల్వే నెట్‌వర్క్‌గా భారత్ రైల్వేను నిలబెడతామని కిషన్‌రెడ్డి అన్నారు.

Advertisement

Next Story