- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో నెలకొన్న జాడ్యాలపై పోరాడాలి : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బాలకృష్ణ
దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో నెలకొన్న పలు జాడ్యాలైన అవినీతి, యువతను పీడిస్తున్న మాదక ద్రవ్యాలు, అలసత్వం లాంటి వాటిపై పోరాడాలని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. భారత దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని ఎందరో మహానుభావులు, విప్లవకార్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని వారు చేసిన త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వేచ్చావాయువులు లభించాయని అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి మరియు రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులలో తిండి గింజలకు ఇబ్బంది పడే రోజు నుండి నేడు చంద్రునిపై స్వయంగా కాలూనే స్థాయికి భారత దేశం ఎదిగిందని పేర్కొన్నారు. దేశానికి ఎందరో మహనీయులు సేవలు అందించారని వారిలో ఒకరైన తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ సంస్థ గత 23 సంవత్సరములుగా ఎందరో పేద క్యాన్సర్ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తోందని అన్నారు. భవిష్యత్తులోనూ ఈ పంథాలో కొనసాగడానికి తన వంతు కృషి చేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు. అనంతరం క్యాన్సర్ పై పోరాడుతున్న చిన్నారులు, వైద్యులతో కలసి మూడు రంగులలో ఉన్న బెలూన్లను గాలిలో ఎగుర వేశారు. ఆ తర్వాత కార్యక్రమానికి హాజరైన చిన్నారులకు, పేషెంట్లకు మిఠాయిలు పంచి పెట్టారు.