అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నాకే బీజేపీతో కలిశాం..

by Ramesh Goud |
అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నాకే బీజేపీతో కలిశాం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నాకే బీజేపీతో కలిసేందుకు ఒప్పుకున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లడుతూ..వైసీపీ నేతలు మా పొత్తుల గురించి, నా ఐడియాలజీ గురించి మాట్లాడుతున్నారని వారికి ఒక్కటే చెప్పదలుచుకున్నానని, మీరు మీ తప్పుడు రాజకీయాల గురించి.. వేరే పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు కానీ, మేము మా ఆశయాల కోసం వ్యూహాలు మారిస్తే తప్పు అవుతుందా? అని ప్రశ్నించారు.

మేము మీ లాగా స్వార్ధ రాజకీయాల కోసం, మినిస్ట్రీల కోసం కలవమని.. ప్రజలకు న్యాయం జరుగుతుందా, అభివృద్ది జరుగుతుందా.. మా రాష్ట్రం బాగుపడుతుందా అనే ఆలోచనతో కలుస్తామని తెలిపారు. బీజేపీతో కూడా కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు. వారితో కలిసే సమయంలో అమరావతిని రాజధానిగా ఉండనివ్వాలని, ఉత్తరాంధ్ర వెనుకబడిందని చెడితే.. అండగా నిలుస్తామన్నారు, రాయలసీమ కరువు ప్రాంతంగా ఉందని, అక్కడి వలసలు ఆపడానికి సాయం చేస్తామన్నారు. ఇలాంటి ఒప్పందాలు జరిగాకే బీజేపీతో కలిసేందుకు ఒప్పుకున్నామని తెలియజేశారు.


Advertisement

Next Story