- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'చిత్త శుద్ధితో నేషనల్ హైవే పూర్తి చేశాం'
దిశ, నెల్లూరు: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మనుబోలు గూడూరు మధ్య నేషనల్ హైవే లో వరదలకు దెబ్బతిన్న రోడ్లను చిత్తశుద్ధితో పూర్తి చేసిందని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు కు దక్షిణంగా బద్దెవోలు రోడ్డు వద్దకు ఇటీవల పూర్తయిన ఆరు లైన్ల రోడ్లను మంత్రి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015 సంవత్సరంలో చెన్నై కలకత్తా నేషనల్ హైవే టీడీపీ ప్రభుత్వ హయాంలో వరదకి కొట్టుకుపోయిందని చెప్పారు.
అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్న హైవే పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదని విమర్శించారు. జిల్లా ప్రజా పరిషత్ అభివృద్ధి మండలి సమావేశంలో సైతం ఇక్కడ రోడ్ల దుస్థితి గురించి పట్టించుకునే దాఖలా లేదని విమర్శించారు. జిల్లాల వైసీపీ అధిక సీట్లు వచ్చాయని ద్వేషం తో ఇక్కడ రోడ్ల పైన చంద్రబాబు దృష్టి పెట్టలేదని ఆరోపించారు. కేంద్రంలో ఇప్పుడు భాగస్వామిగా ఉన్న టీడీపీ కేంద్ర మంత్రులుగా ఉన్న నేషనల్ హైవే పై నిర్లక్ష్యం వహించారని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.