YS Jagan:నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: మాజీ సీఎం

by Jakkula Mamatha |
YS Jagan:నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: మాజీ సీఎం
X

దిశ,వెబ్‌డెస్క్: నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకన్నట్లు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) ప్రకటించారు. నో డ్యూ సర్టిఫికెట్లు(No Due Certificates) గ్రామస్థాయిలో ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని, పోలీసులతో కలిసి అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచిన తమ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు.

‘‘ఈ దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం మీ అరాచక పాలనకు నిదర్శనం కాదా? అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎంపీ అవినాష్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? అలాంటప్పుడు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? మీకు నచ్చినవారిని నామినేట్‌ చేసుకుంటే సరిపోతుందిగా? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామని ఓవైపు డప్పులు కొట్టుకుంటూ మరోవైపు పోలీసులను దన్నుగా పెట్టుకుని దాడులు చేస్తున్నది నిజం కాదా? అందుకే అప్రజాస్వామికంగా జరుగుతున్న ఈ నీటి సంఘాల ఎన్నికలను ఖండిస్తూ, బహిష్కరించాలని వైయస్సార్‌సీపీ నిర్ణయం తీసుకుంది. రైతుల తరఫున ఎప్పుడు వారికి అండగా ఉంటూ వైసీపీ పోరాటం కొనసాగిస్తుంది’’ అని వైఎస్ జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story