AP Elections 2024: ఈ నెల 27 న మేమంతా సిద్ధం అంటున్న వైసీపీ..

by Indraja |
AP Elections 2024: ఈ నెల 27 న మేమంతా సిద్ధం అంటున్న వైసీపీ..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఈ నెల 27వ తేదీ నుండి మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సిద్ధం సభతో జోష్ లో ఉన్న జగన్ మరోసారి మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి రానున్నారు. సిద్ధం సభతో కోవర్ కానీ నియోజకవర్గాలను మేమంతా సిద్ధం సభతో కవర్ చేయనున్నారు.

ఇందులో భాగంగా ఈ నెల 28, 29వ తేదీల్లో కర్నూలులో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఆ సభల్లో వైసీపీ గత ఐదేళ్లలో సాధించిన అభివృద్ధిని గురించి ప్రస్తావించనున్నారు. 20ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కేవలం ఐదేళ్లలో సాధించిన ఘనత వైసీపీదే అని తెలియచేయడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని పలువురు పార్టీ నేతలు తెలుపుతున్నారు. ఇక ఈ సభల్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పని చెయ్యాలని సలహాలు, సూచనలు తీసుకోనున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story