- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: జనసేన వర్సెస్ వైసీపీ.. తగ్గేదేలే అంటున్న ట్విట్టర్ వార్
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీల కి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ, జనసేన తగ్గేదేలే అంటూ X (ట్విట్టర్) వేదికగా మాటల యుద్దానికి దిగాయి. తాజాగా ట్విట్టర్ లో జనసేన పార్టీ వైసీపీని ప్రశ్నిస్తూ ఓ పోస్ట్ చేసింది.
ఆ పోస్ట్ లో ఉపాధి కల్పించని మీ ప్రభుత్వంలో పేదోడి బ్రతుకు మారేదెప్పుడు..? అవగాహనా రాహిత్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 85 వేలమంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టిన మీరు ప్రతి బిడ్డా చదువుకునే పరిస్థితిని తీసుకొచ్చేది ఎప్పుడు..? రైతు భరోసా కేంద్రాలకే భరోసా కల్పించలేని మీ ప్రభుత్వం రైతు బంగారు పంటలు పండించడానికి సహకరించేది ఎప్పుడు..?
రాష్ట్రం పరిశ్రమలతో, కంపెనీలతో కళకళలాడుతూ యువతకు ఉద్యోగావకాశాలు దొరికేదెప్పుడు..? చీప్ లిక్కర్ అమ్మి ప్రజల రక్తం తాగే సైకో కూళీల్లారా, దింపుతాం.. మీ అధికార మదం దిగిపోయేలా ప్రజా మద్దతు కూడగట్టి దింపుతాం.. రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన మిమ్మల్ని రాష్ట్రం నుండి తరిమికొట్టేలా దింపుతాం.. అంటూ రాసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అకౌంట్ పెట్టిన పోస్ట్ పై స్పందించిన YSR కాంగ్రెస్ పార్టీ అకౌంట్ ధీటుగా ఘాటైన సమాధానమిస్తూ.. టీడీపీ ఇచ్చే కూలితో బతికే కూలీ సైనికుల్లారా ఆయన దిగరు.. ఆయన ఈ రాష్ట్రాన్ని దత్తత తీసుకున్నారు. పేదల బతుకులు బాగయ్యేవరకు, ప్రతి బిడ్డా చదువుకునేవరకు, ప్రతి ఇంటా చిరునవ్వులు పూసేవరకు, ప్రతి చెల్లీ సమున్నతంగా నిలబడేవరకు, ప్రతి రైతు బంగారు పంటలు పండించేవరకు, రాష్ట్రం పరిశ్రమలతో, పాడిపంటలతో కలకాలాడేవరకు ఆయన పదవిలోంచి దిగరు.
పెత్తందారుల పక్షాన ఉన్నందుకు మీకు బుద్దిచెప్పేవరకు ఆయన దిగరు.. అయినా ముందు మీ జనసేన పార్టీకి 175 స్థానాల్లో పోటీ చేసేందుకే దిక్కులేదు. వేరే వాళ్ళ గుమ్మం ముందు నిలబడి సీట్లు ఆడుకుంటున్నారు. ముందు మీకు భిక్షంగా ఎన్ని సీట్లు వస్తాయో తేల్చుకోండి.. మా సంగతి చూసేంత కాదు కదా మా గురించి ఆలోచించే స్థాయి కూడా మీకు లేదు.. అని YSRCP పార్టీ కామెంట్ లో పేర్కొంది. ఇక ఈ పోస్ట్ పైన నెటిజన్స్ కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జనసేనను ప్రశంసిస్తూ కామెంట్ చేస్తే మరి కొందరు జనసేనను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.