- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా:మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని..అందరికీ ఆహారం సమృద్ధిగా అందాలని, పాడిపంటలతో పురోభివృద్ధి ప్రసాదించాలని జగన్మాతను వేడుకున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో దర్శనం అనంతరం ఆశీర్వచనం అందించారు. అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదం, చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ రాష్ట్రం ప్రజలందరికీ ఆహారాన్ని అందించే శాఖకు మంత్రిగా నియమించడం అమ్మవారి కృపయేనని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిరాఘాటంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగేందుకు ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని దుర్గమ్మను వేడుకున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.