వీఆర్ విద్యాసంస్థలను తిరిగి కొనసాగించాలి.. ఎస్ఎఫ్ఐ

by Indraja |
వీఆర్ విద్యాసంస్థలను తిరిగి కొనసాగించాలి.. ఎస్ఎఫ్ఐ
X

దిశ, నెల్లూరు రూరల్: నెల్లూరు నగరంలో విఆర్ విద్యాసంస్థలను తిరిగి కొనసాగించాలంటూ బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి నరేంద్ర, ఎం శ్రీహర్ష నగర టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ కలిసి వినతి పత్రం సమర్పించారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన విఆర్ విద్య సంస్థలను తిరిగి కొనసాగించేందుకు కృషి చేయాలని వారు ఆయనను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో ఎంతో చరిత్ర కలిగిన వి ఆర్ విద్యాసంస్థలు నేడు ఆలనా, పాలన లేక భవనాలు శిధిలావస్థలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కోట్ల విలువ చేసే కళాశాల స్థలంపై అక్రమార్కుల కన్ను పడిందని కళాశాలను పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎందరో మేధావులు, రాజకీయ ఉద్దండులను తయారుచేసిన విఆర్ కళాశాల పరిస్థితి నేడు దయనీయంగా ఉందని ఆవేధన వ్యక్తం చేశారు. 2019లో సుప్రీంకోర్టు ఈ కళాశాలకు సొసైటీ ఎన్నికలు జరిపి నూతన కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారని.. నామినేషన్లు కూడా స్వీకరించారని.. అయితే ఆ తరువాత ఊహించని రీతిలో అది అద్దాంతరంగా ఆగిపోయిందని పేర్కొన్నారు., విద్యాసంస్థల ఆస్తులను పరిరక్షించేందుకు, విద్యాసంస్థలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలని వారు కోరారు.

Advertisement

Next Story