- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tdp: దేశ రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు ఎన్టీఆర్
దిశ, అనకాపల్లి: తెలుగుదేశం 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఆ పార్టీ నేతలు సబ్బవరం మండలంలో ఘనంగా జరిపారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా బండారు మాట్లాడుతూ సినీ నటుడు పెట్టిన పార్టీ దేశ రాజకీయాలను మలుపు తిప్పిందని అన్నారు.
ప్రపంచ దేశాల్లో ముఖ్య దేశమైన అమెరికా ప్రెసిడెంట్‌ని తీసుకొచ్చి డ్వాక్రా సంఘాల మహిళలను చూపించి ఆయన దగ్గర ప్రశంసలు పొందిన ఘనత చంద్రబాబుదని అన్నారు. కిలో బియ్యం రెండు రూపాయలు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. మహిళలను గుర్తించిన వ్యక్తి ఎన్టీఆర్ అని మహిళలకు రిజర్వేషన్, మహిళలకు సమాన ఆస్తి హక్కు, స్థానిక సంస్థలు రిజర్వేషన్, హక్కులను హక్కులను కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళా సాధికారిక, డ్వాక్రా సంఘాలు, దీపం పథకం, ఆయుష్మాన్ భవ, చంద్రన్న బీమా, పెళ్ళికానుక, నిరుద్యోగ భృతి, ఈ పథకాలన్నీ ఏమయ్యాయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.