- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Peela Satyanarayana: ఆ ఫ్యాక్టరీని తెరిపించు. లేదంటే రాజీనామా చేయ్..!
దిశ, ఉత్తరాంధ్ర: 13 వేల మంది రైతుల జీవితాలతో ముడిపడిన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని టీడీపీ హయంలో చంద్రబాబు రూ. 36 కోట్ల నిధులతో తెరిపిస్తే ఇప్పుడు మంత్రి అమర్‌నాథ్ ఆదే ఫ్యాక్టరీని ముసివేశాడని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. మంత్రి అమర్‌నాథ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులను మంత్రి అమర్‌నాథ్ దోచుకుంటూన్నారని మండిపడ్డారు. తన ఛాలెంజ్‌ను తీసుకునే దమ్ముందా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి నడిబొడ్డున ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. రైతులందరూ ఏకం అవ్వాలని, షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులను వైసీపీ నాయకులు దోచుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వేలాది మంది రైతుల కన్నీళ్ళలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులను వైసీపీ నాయకులు తమ పేర్ల మీద వేసుకుంటున్నారన్నారు. షుగర్ ఫ్యాక్టరీ భాగస్వామ్యం రైతులదని, దీనిపై ప్రతి పైసా కూడా రైతులకే చెందుతాయని పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు.