- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయనగరం జిల్లాలో దారుణం.. బంగారం వర్కర్లపై కాల్పులు
X
దిశ, వెబ్ డెస్క్:విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పనవలసలో దారుణం జరిగింది. ఇద్దరు బంగారం వర్కర్లపై దుండగులు కాల్పులు జరిపారు. రాజాంకు చెందిన ఇద్దరు బంగారం వర్కర్లు బైక్‌పై బంగారం వస్తువులు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే దుండగుల కాల్పులతో తమ వద్ద ఉన్న బంగారాన్ని వర్కర్లు చెట్లల్లో పడేశారు. దీంతో రెండు సెల్ ఫోన్లు, నగదును తీసుకుని దుండగులు పరారయ్యారు. బంగారం వర్కర్లపై కాల్పులు జరపడంతో పాటు కళ్లలో కారం చల్లి రాడ్డుతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు బంగారం వర్కర్లు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Advertisement
Next Story