విజృంభించిన అతిసారం.. నలుగురు మృతి

by Rani Yarlagadda |
విజృంభించిన అతిసారం.. నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో అతిసారం విజృంభించింది. గుర్లలో గడిచిన మూడ్రోజుల్లో అతిసారం కారణంగా ఐదుగురు మరణించగా.. మంగళవారం ఒక్కరోజే మరో నలుగురు మృతి చెందారు. తోండ్రంగి రామయ్యమ్మ (60) ఇంటి వద్దే మరణించగా.. సారిక పెంటయ్య (65), కలిశెట్టి సీతమ్మ (45) ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పైడమ్మ (50) అనే మహో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

అతిసారంతో మరో 10 మంది బాధితులు విజయనగరం, విశాఖలలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులకు వైద్యం అందించిన ఆశాకార్యకర్త రాజేశ్వరికి కూడా అతిసారం సోకడంతో ఆమెను కూడా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. అతిసారంతో మృతి చెందినవారికి వ్యాధితో పాటు హార్ట్, కిడ్నీ, బీపీ, షుగర్ వంటి సమస్యలున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed